Kana Purambulo Kadu Vintaga |కానాపురంబులోఁ గడు వింతగా

మంగళము 562:1,2,3,4,5,6

1.కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||
2.రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||
3.దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||
4.ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||
5.చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||
6.పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.