Margamu Chupumu |మార్గము చూపుము ఇంటికి

681:1,2,3,4,5,6,7

1.మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి
  మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి(2)
2.పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము
  పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
  ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము     ||మా||
3.ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
  ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి నినుచేరితి
  దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము          ||మా||
4.దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
  తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము
  దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము      ||మా||
5.అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో
  అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను వేదన
  అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము ||మా||
6.కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి
  కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు
  కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించు బ్రోవుము    ||మా||
7.నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను
  నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను
  నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ||మా||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.