Nannu Diddumu |నన్ను దిద్దుము చిన్న ప్రాయము

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా                     ||నన్ను||

దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా                        ||నన్ను||

మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా                          ||నన్ను||

చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా                       ||నన్ను||

జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా                    ||నన్ను||

కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా                      ||నన్ను||

ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా                       ||నన్ను||

శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా            ||నన్ను||

వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా                                ||నన్ను||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.