Nannu Gannayya Rave |నన్ను గన్నయ్య రావె నా యేసు
క్రీస్తునందలి అభయము 377:1,2,3,4,5,6
1.నన్ను గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
2.ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను||
3.హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
4.కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
5.దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
6.నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||