Navanni Angikarinchumi |నావన్ని యంగీకరించుమీ దేవా
సమర్పణము 441:1,2,3,4,5,6,7,8,9
1.నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య మొందెద ||నావన్ని||
2.నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||
3.సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ సేవఁ జేసెద ||నావన్ని||
4.నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||
5.పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి గించు దృఢ భక్తి ||నావన్ని||
6.నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను నాశింప మదిలోన ||నావన్ని||
7.నీవు నా కొసఁగిన నిర్మల బుద్ధిచే సేవఁ జేయఁగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని||
8.చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ మార్గంబుఁ దెలుపుము ||నావన్ని||
9.హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దానిఁ బట్టి కాపాడుము ||నావన్ని||