Nenunu Naa Inti Varunu |నేనును నా యింటివారును నీతి

క్రైస్తవుని ప్రతిజ్ఞ 518:1,2,3,4,5,6,7,8,9,10

1.నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము||
2.అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||
3.వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము||
4.ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||
5.సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి పనులన్నిటి కృంగదీసెదమనిశము ||
6.ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము ||
7.శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||
8.చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||
9.పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు ||
10.జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.