Ninnu Nenu Viduvanu Deva |నిన్ను నేను విడువను దేవ

నీవు నన్ను ఆశీర్వదింపని యెడల నిన్ను వెళ్లనియ్యను 381:1,2,3,4,5,6,7,8

1.నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు ||నిన్ను||
2.నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను||
3.త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను||
4.నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను||
5.ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని ||నిన్ను||
6.నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు ||నిన్ను||
7.అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి ||నిన్ను||
8.నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి ||నిన్ను||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.