O Sangama Sarvangama |ఓ సంఘమా సర్వాంగమా

641:1,2,3,4,5,6,7

1.ఓ సంఘమా – సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా 
  మెస్సయ్యను – ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా 
  ఓ సంఘమా – వినుమా 
2.రాణి ఓఫేరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో 
  వీణ వాద్య తరంగాలలో – ప్రాణేస్వరుని ప్రసన్నతతో 
  ఆనంద తైలా సుగంధాభిషేకము – నొందితివే సువాసనుండా                ||ఓ||
3.క్రీస్తే నిను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని 
  స్వస్థపరచే నిర్దోషముగా – ముడత కళంకము – లేనిదిగా  
  మహిమ యుక్తంబుగా – నిలువగోరె యేసువా – సహించుతావా తీర్పునాడూ     ||ఓ||
4.చీకటిలోనుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు 
  శ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలచెనని 
  గుర్తించుచుంటివా క్రియలను గంటివా – సజీవముగా నున్నావా               ||ఓ||
5.వ్యభిచారులు నరహంతకులు – పోకిరి చేష్టల డాంబికులు 
  అబద్దజనకుని యాసనము – యెజిబెలు నీ మధ్య నివసించెనా –
  క్రుపావరములు – ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా                ||ఓ||
6.చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీకది మేలగును 
  నులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమో
  నీమనసు మార్చుకో – తొల్లిప్రెమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు            ||ఓ||
7.కడపటి బూర మ్రోగగానే – కనురెప్ప పాటున మారుదువా 
  వడిగా మేఘాసీనుడవై – నడియాకాసము పోగలవా 
  గొర్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా – రారాజు నెదుర్కొనగలవా           ||ఓ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.