Parishuddi parishuddi |పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

పరిశుద్ధుల ప్రకాశత 504:1,2,3,4,5,6

1.పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ బడు పుర మదిగో పద పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి చిరమై భాసురమై సు స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||
2.రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||
3.గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు గుదురుగ నెదురుగఁ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||
4.ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||
5.జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ ళ్లన్నియు దుడుచు మన దేవుఁ డందుండి ||పరిశుద్ధి||
6.వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర మునఁ బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు ని చ్ఛల నిచ్చు దేవుఁడు ||పరిశుద్ధి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.