Preethigala Mana Yesu |ప్రీతిగల మన యేసు
What a friend we have in jesus 407:1,2,3,4
1.ప్రీతిగల మన యేసుఁ డెంతో గొప్ప మిత్రుఁడు మితిలేని దయచేత హత్తుచుఁ బ్రేమించును క్రీస్తునొద్ద మన భార మంత నప్పగించినన్ శక్తిగల యేసుచేత మోఁత లెల్ల వీడును
2.నీతిగల మన యేసు ధృతిగల మిత్రుఁడు మృతిఁ బొంది కృపతో వి శ్రాంతి కలిగించెను భీతి నొందుఁ బాపు లైనఁ జింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతిఁ జూతురు
3.దయగల మన యేసు ప్రియమైన మిత్రుఁడు మాయలోకమందు నిజా శ్రయుఁడై కాపాడును భయ దుఃఖ శ్రమ లాది మోయరాని బాధలన్ జయ మొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధిచేయును.
4.ధారుణిలో యేసుగాక వేరుగొప్ప మిత్రుఁడా? పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుఁడు నారకుల! గావ వేగఁ గ్రూర హింసఁ బొందెను కరుణించి నిచ్చి ప్రతి ప్రార్థన నాలించును.