Randi Randi Yesuni Vaddaku |రండి రండి యేసుని యొద్దకు
685:1,2,3,4,5,6
1.రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే 2.యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల అవనిలో అగచాట్లపాలైన అబ్బదుశాంతి ఆత్మకు నిలలో ||రండి|| 3.కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి చ్చుచున్నారు ||రండి|| 4.ప్రభుయేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యాఘనుడు మనకై ||రండి|| 5.యేసుని నామమునందే పరమ నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి|| 6.నేనే మార్గము, నేనే సత్యము నేనే జీవమును నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||