Sakshyamichheda |సాక్ష్య మిచ్చెద స్వామి
క్రైస్తవ సాక్ష్యము 356:1,2,3,4,5,6,7,8
1.సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ డంచు సాక్ష్య మనఁగఁ గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు || సాక్ష్య||
2.దిక్కు దెసయు లేని నన్ను దేవుఁ డెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మశ్శాంతి నిచ్చినాఁడో ||సాక్ష్య||
3.పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల కును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||
4.బోధ చేయలేను వాద ములకుఁ బోను నాక దేల నాధుఁ డేసు ప్రభుని గూర్చి నాకుఁ దెలిసినంత వరకు ||సాక్ష్య||
5.పాపులకును మిత్రుఁ డంచుఁ బ్రాణ మొసఁగి లేచె నంచుఁ బావముల క్షమించు నంచుఁ బ్రభుని విశ్వసించుఁ డంచు ||సాక్ష్య||
6.చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైనఁ క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||
7.పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవఁ డంచు ||సాక్ష్య||
8.ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||