Stotramu Cheyare |స్తోత్రము సేయరే సోదరులార

వీడ్కోలు శుభములు 605:1,2,3,4,5,6,7,8

1.స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్
  ధాత్రిని మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి      ||స్తోత్రము||
2.ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో
  అచ్చట మన మం దఱముఁ గలిసికొని యానందింతుముగా     ||స్తోత్రము||
3.ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత
  మిక్కిలి ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను      ||స్తోత్రము||
4.కన్నీరుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను
  మన శృంగారపు బ్రతుకు లెన్నఁదరము గాదె              ||స్తోత్రము||
5.వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట
  రాగము లెంతో రమ్య మై యుండును బాగింతన లేము      ||స్తోత్రము||
6.మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము
 త్వరలో మున పర లోకపు దండ్రి తోడ నుందు మేమో       ||స్తోత్రము||
7.గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా
  గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా    ||స్తోత్రము||
8.పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో
  స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్     ||స్తోత్రము||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.