Thrahimam Kreestu Nadha |త్రాహి మాం క్రీస్తు నాధ

పశ్చాత్తాప ప్రార్థన 313:1,2,3,4,5

1.త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే 
నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||

2.గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై
రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ
త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి
యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||

3.నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని
చేయరాని దుష్కర్మములు చేసినాఁడను
దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ
జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||

4.నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుటకు ము త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||

5.నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు
చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.