Ye Papa Merugani |ఏ పాప మెఱుగని యోపావన

సిలువపై క్రీస్తుని ప్రేమ 186:1,2,3,4,5,6,7,8

1.ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా                                       ||యే పాప||
2.ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా                                        ||యే పాప||
3.కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా                               ||యే పాప||
4.చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా                                      ||యే పాప||
5.ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా                                      ||యే పాప||
6.పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా ||యే పాప||
7.బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము         ||యే పాప||
8.కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి                      ||యే పాప||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.