Yehova Ma Thandri Kada |యెహోవా మా తండ్రి గాడ

మన బంధువులు 435:1,2,3,4,5,6,7

1.యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ 
మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||
2.మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు
సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||
3.అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే
శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||
4.పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్
ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||
5.తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి
మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||
6.పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె
చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||
7.కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని 
పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||

 

I wanna Share a Beautiful Testimony Behind This song .. here it is!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.