Yesuni Korkai Ila Jeevincheda|యేసుని కొరకై యిల జీవించెద

యేసుకొరకే జీవింతును 474:1,2,3,4,5,6,7,8,9

1.యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||
2.నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||
3.పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||
4.అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||
5.శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||
6.బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని||
7.అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప ||యేసుని||
8.ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని||
9.యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.