Yesuva Jayamutho |యేసువ జయముతో యెరుషలేమున

మట్టలాదివారము 593:1,2,3,4,5,6,7

1.యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా
  వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా   ||యేసువ||
2.మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా
  అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా   ||యేసువ||
3.పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా
  చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా        ||యేసువ||
4.కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా
  అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా      ||యేసువ||
5.యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా
  యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా     ||యేసువ||
6.మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా
  మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా   ||యేసువ||
7.మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా 
  సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా     ||యేసువ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.