Ninnu Kapadu Vadu
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదుర పొడేన్నడు
నీభారం వహియించే యేసు నీ కొరకే మరణించే చూడు “2”
1.పలుకరిచే వారు లేక పరితపిస్తున్నా
కనికరించే వారులేక కుమిలిపోతున్నా “2”
కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా “2”
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను “2”
2.మనసులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరులమాటలు కృంగదీసి భాధపెడుతున్నా “2”
భీతులెన్నో బ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను “2