Yesu Ela Vivarinthunu |యేసూ ఎలా వివరింతును

యేసూ ఎలా వివరింతును…. నాపై నీకున్న ప్రేమ
కను పాపను కాపాడే కను రెప్పకున్న ప్రేమ
దోసెడు నీళ్ళైన దాయని కురుయు మబ్బుకున్న ప్రేమ
సరితూగునా ఈ ఇలలో ఏ ప్రేమ అయినా (2)
నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
ఆరాధనా …. ఆరాధనా …. నీ ప్రేమకే నా ఆరాధనా ….

ఛళ్ళు ఛళ్ళు మని కొరడా దెబ్బలు గాయపరుచుచున్నా
దున్నుతున్న వీపు రక్తము చిందించి … ఏరులై పారుతున్నా
శిరస్సున ముళ్ళ కిరీటం ఈటెలై పొడుచుకుపోతున్నా (2)
అణువైన తగ్గలేదు ప్రభూ —– నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
— ఆరాధనా —

మోయలేని సిలువ భారము మోసినా … ఉమ్మి వేయబడినా
సీలలే అర చేతిని చీల్చినా… ఖడ్గములై గుండెను కోసినా
కడ సారి దప్పిక దీర్చ నీళ్ళైన కరువయినా (2)
కాస్త అయిన తరిగిపోలేదు ప్రభూ —— నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
— ఆరాధనా —

పాపపు మార్గము ఎంచినా … అపరాధిని అయినా
నీ నామము వ్యర్థముగా వాడినా … కలుషములే పలికినా
నిన్ను యెరుగనని అబద్ధమాడినా … నీ గుణమే శంకించినా (2)
ఒక్క క్షణమైనా వీడిపోలేదు ప్రభూ —— నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
— ఆరాధనా –

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.