Na Jeevithaniki O Bhagyama |నా జీవితానికి ఓ భాగ్యమా
నా జీవితానికి ఓ భాగ్యమా
మమతలు కురిపించే అనుబంధమా
చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా
నే మరువలేని నా ప్రాణమా
యేసయ్యా నీవు నా తండ్రివి
యేసయ్యా నేను నీ సొత్తును |2|
మన్నును ఎన్నుకొన్నదీ నీ సంకల్పం
నిలిపెను సారెపై నీ ఉద్దేశ్యం |2|
రూపము నిచ్చావు జీవము పోశావు |2|
పరిశుద్ధ ఘటముగా నిలిపావయ్యా
యేసయ్యా నీవు నా కుమ్మరి
యేసయ్యా నేను నీ రూపును |2|
ప్రేమతో పెనవేసెను నిను నా జీవితం
సారము ధారపోయగా ఫలియించితి |2|
నాలో నిలిచావు నీతో నిలిపావు |2|
శ్రేష్ఠఫలములు నిచ్చావయ్యా
యేసయ్యా నీవు నా వల్లీవి
యేసయ్యా నేను నీ తీగను |2|