ప్రేమా – ప్రేమా – యేసు ప్రేమనా ఊహకందనిది నన్ను ఆదరించినది వర్ణింపజాలనిది నాపై నీకున్న ప్రేమ 1.ఆదరణ కొదువై నేను అల్లాడి పోచుండగను ఆదరణ కర్తవై నన్ను ఓదార్చితివా |2| నావాళ్ళు చూపని ప్రేమ, నన్ను విడనాడని ప్రేమ నా కొరకు త్యాగమైన నా యేసు రక్షకా 2.పాపినై నేనుండగ పాపములో పడియుండగ పాపంబు బాపుటకు ప్రాణమే ఇచ్చితివా|2| నా కొరకు రక్తము కార్చి, నా కొరకు సిలువను మోసి నా కొరకు బలియైన నా ప్రాణ రక్షకా 3.శోధనలు ఎన్నెదురైనా శ్రమలలో నే పడియున్నా నిన్ను నే వీడను నా యేసురాజా |2| నా చేయి విడవకుమా, నాతోడు విడనాడకుమా|2| నీతోనె కొనసాగెదను నా ఆత్మ రక్షకా