Nee Palakarimpulo |నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది
నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది, యేసయ్యా యేసయ్యానీ పలకరింపులో ఓదార్పు ఉన్నది |2|నా కలవరాన్ని హరియించి, ఆదరణ నిచ్చుచున్నది|2|ప్రేమామయుడా యేసయ్యా |2| క్షేమాధారం నీవయ్యా |2|నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది |2|
1.పాపులను పలకరించి పాపములను క్షమియించావుదీనులకు చేయిచాపి ఆత్మీయతను పంచావు |2|
నీ పిలుపులో కనికరం, నీ పలుకులో పరిమళం |2|నీవే సంతోషం |2| || ప్రేమామయుడా యేసయ్యా||
2.రోగులను పలకరించి ఆరోగ్యము కలిగించావుమృతులకు ప్రాణం పోసి మరణంనుండి లేపావు|2|
నీ పిలుపులో ఆర్ద్రత, నీ పలుకులో స్వస్థత |2|నీవే చేయూత |2| || ప్రేమామయుడా యేసయ్యా||
3.శిష్యులను పలకరించి ఆందోళన తొలగించావుఅందరికి బోధచేసి దుర్మార్గులను మార్చావు |2|
నీ పిలుపులో ధైర్యము, నీ పలుకులో అభయము|2|నీవే ఆశ్రయము |2| || ప్రేమామయుడా యేసయ్యా||