Yathrikulam Paradeshulam |యాత్రికులం పరదేశులం
యాత్రికులం పరదేశులం, మా ఊరు పరలోకము |2|
ఇది యాత్రా, కానాను యాత్రా, సీయోను యాత్రా,
యెరూషలేము యాత్రా, యెరూషలేము యాత్ర
||యాత్రికులం పరదేశులం||
ఈ యాత్రలో ఆటుపోటులు ఎదురైననూ ఆగిపోను నేను |2|
నా విశ్వాసము కాపాడుకొనుచు, ఇలలో సాగెదనూ |2|
విశ్వాస ప్రేమ నిరీక్షణ నడుపును సీయోనుకు
||యాత్రికులం పరదేశులం||
శత్రుసమూహము వెంటాడినను భయపడనూ ఓడించును ప్రభువే |2|
ఎర్ర సముద్రము ఎదురైననూ, యేసే నడిపించునూ పాయలుగా చేయును|2|
జయమిచ్చును నడిపించును చేర్చును కానానుకు
||యాత్రికులం పరదేశులం||