Alochinchu Alochinchu |ఆలోచించూ ఆలోచించు

ఆలోచించూ ఆలోచించు – ఓ నా నేస్తం ఆలోచించు

అన్వేషించూ అన్వేషించు – ఒక్కసారి అన్వేషించు = 2

నీ గమనం ఏమైయుందో – నీ గమ్యం ఎక్కడ ఉందో

ఏ తరుణం ఏమౌతుందో – నీ తీర్పు ఏమైయుందో

దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు – బదులేమిస్తావో..!?

1. నీతిగా నువ్వే జీవిస్తే – దేవుని రాజ్యం నీదవదా

చీకటి దారి నీదైతే – నిప్పుల వలలే ఎదురవవా = 2

నీ పాపపు జీవితమంతా – ప్రభురక్తంలో కడగాలి

నీ ఎదలో దేవుని ధ్యానం – వినిపించే స్వరమవ్వాలి

సగము ఇహము – సగము పరమని జీవిస్తున్నావా..?!

2. దుష్టుల స్నేహం విడిపోతే – హృదయం దేవుని వశమేగా

పాపుల మార్గంలో వెళితే – మరణం నీకు శరణవదా = 2

చెడు పలికే నీ పెదవులకు – ప్రభు ప్రార్ధన ఫలమిస్తుందా

చెడు చూసే నీ కన్నులకు – పరలోకం కనిపిస్తుందా

ఇదియే సమయం – ఇపుడే యేసుకు మనసిస్తున్నావా..?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.