Nee Maata Naa Paataga |నీ మాట నా పాటగా
నీ మాట నా పాటగా – అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా – నా స్వరం వాడనీ
నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ..
1. ఏ చోట గళమెత్తినా – నీ ప్రేమ ధ్వనియించనీ
పాడేటి ప్రతి పాటలో – నీ రూపు కనిపించనీ = 2
వినిపించుచున్నప్పుడే – ఉద్రేకమును రేపక
స్థిరమైన ఉజ్జీవము – లోలోన రగిలించనీ
నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ..
2. నీ దివ్య గానామృతం – జలధారలుగా పొంగనీ
తాకేటి ప్రతి వారినీ – ఫలవంతముగా మార్చనీ = 2
శృతిలయలు లోపించక – విసిగింపు కలిగించక
నిజమైన ఉల్లాసమై – నిలువెల్లా కదిలించనీ
నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ..
3. ఆత్మీయ గీతాలతో – తనువంతా పులకించనీ
సంగీతమే భోధయై – కనువిప్పు కలిగించనీ = 2
కాలక్షేపం కోసమే – పరిమితము కాకుండగా
హృదయాల్లో నివసించుచూ – కార్యాలు జరిగించనీ
నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ.