Stuthi paathruda |స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతిపాత్రుడా.. – స్తోత్రార్హుడా.. – స్తుతులందుకో పూజార్హుడా..
ఆకాశమందు నీవు తప్ప – నాకెవరున్నారు నా ప్రభూ..
1. నా శత్రువులు నను తరుముచుండగా – నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ..
నా మనసు నీవైపు – త్రిప్పిన వెంటనే – శత్రువుల చేతినుండి విడిపించినావు – కాపాడినావు
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి – దూరాన నిలిచేరు నా ప్రభూ..
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై – నను నిల్పెను నీ సన్నీధిలో – నీ సంఘములో