Parishuddudu Parishuddudu
పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుదిరుగను నాయందు నీవుండగా
నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును
కష్టములెన్నొచ్చినా కృంగి పోకుందును
ఎన్నటికీ వెనుదిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను జయశాలి నీవుండగా