Naa Vedanalo Aavedanalo |నా వేదనలో ఆవేదనలో
నా వేదనలో ఆవేదనలో
నీ వాక్యమే నను బ్రతికించినది
నా రోదనలో నా యాతనలో
నీ మాటలే నను ఓదార్చినవి
యేసయ్యా—– యేసయ్యా——- 2
చేయని నేరము చేసెను గాయము
వేసిన నెపము మోపెను భారము
నా కృప చాలును అన్న నీ మాటే
నను బ్రతికించెనయ్యా.
యేసయ్యా. యేసయ్యా…..
నీ వాత్సల్యమునే మరువలేనయ్యా
చేసిన మేలే కీడుగా మారె
చూపిన ప్రేమే చేదుగా మిగిలె
ఒంటరినైన నన్ను చేరదీసావే
నన్ను ఆదరించినావే (నడిపించినావే)
యేసయ్యా…… యేసయ్యా……
నీ మమకారమునే మరువలేనయ్యా