వారి_కడుపే_వారి_దేవుడు ఫిలిప్పీయులకు 3 : 19

ఒక ఎడారిలో ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు.వారు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోగా చాలా ఆకలితో,దాహంతో ఉన్నవారికి మార్గమధ్యంలో ఎక్కడా ఎటువంటి ఆహారం దొరకలేదు.కొంత దూరంలో ఒక మసీదు కనపడింది.అక్కడ చాలామంది ముస్లీములు విందు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ ఇద్దరు స్నేహితులు క్రైస్తవులు.అందులో ఒకడు మైఖేల్,ఇంకొకరు జాన్.మైఖేల్ తన స్నేహితునితో “జాన్ మనం చనిపోకుండా బ్రతికి ఉండాలంటే ఆ మసీదు దగ్గరికి వెళ్లి మనం కూడా ముస్లీములమని చెప్పాలి.అప్పుడే వాళ్ళు మనకి భోజనం పెడతారు.లేదంటే మనం ఆకలితో చావాల్సి వస్తుంది. నేను నా పేరు మహమ్మద్ అని చెప్తాను,నీ పేరు జాకీర్ అని చెప్పు” అన్నాడు.

అందుకు జాన్ “మనం క్రైస్తవులం,సత్యదైవాన్ని నమ్మినవారము.అనుకోని స్థితిలో ఇలా శ్రమకు అప్పగించబడ్డాము.ఇప్పుడు ఈ శ్రమకు తట్టుకోలేక ఒక పూట భోజనం కోసం మనము క్రైస్తవులమే కాదు అని చెప్పమంటున్నావ్. బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి కూడా ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావ్.ఆదిలోనే సాతాను అవ్వను శోధించడానికి ఎర వేసింది ఆహారాన్నే అని మర్చిపోయావా? ఎర్రటి కూర కోసం తన జేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏశావుని మర్చిపోయావా? ఆఖరికి లోక రక్షకుడు నలుబది దినాలు ఉపవాసం తర్వాత ఆయన్ని శోధించడానికి రాళ్లను రొట్టెలు చేసుకొమ్మని చెప్పిన సాతాను మాటలు మర్చిపోయావా? ప్రాణమయినా వదిలేస్తాను గానీ చచ్చేదాకా క్రైస్తవుడి లాగే బ్రతుకుతా!!అంతే తప్ప అబద్ధం చెప్పి నా దేవుడికి అవమానం తీసుకురాను.అయినా కాకులతో ఆహారం పెట్టి పోషించిన వాడు మనల్ని కాపాడలేడని ఎలా అనుకుంటున్నావ్”అని అన్నాడు.

అప్పుడు మైఖేల్ “సరే!!నీ చావు నువ్వు చావు.నేను ఆకలితో చావడం కన్నా వాళ్ళతో కలిసిపోవడమే నయం” అని ఇద్దరు అక్కడికి చేరుకున్నారు.

అక్కడ ఇమామ్ అనే పెద్దాయన వారిని చూచి ఎవరని అడగగానే మైఖేల్ తనపేరు మహమ్మద్ అని తాను ముస్లీం అని సలాం చేసాడు.పక్కనే ఉన్న జాన్ తన పేరు జాన్ అని తానొక క్రైస్తవుడనని తాము చాలదూరం నుండి ప్రయాణం చేసి అలసి పోయామని తమకేమైన ఆహారం ఉంటే పెట్టవలసిందిగా కోరాడు.

అందుకు ఇమామ్ భాయ్ “జాన్ గారు మీరు వెళ్ళి స్నానము చేసి రండి.మీకు విందు సిద్ధం చేయిస్తాము.మహమ్మద్ భాయ్ మీరు కూడా స్నానం చేసి మసీదు లోపలికి రండి.ఎందుకంటే మీకు తెలియనిది కాదు,ఇవి రంజాన్ మాసం కనుక మీరు ఉపవాసంలో గడపాలి” అని అనగానే మైఖేల్ మొహంలో నెత్తురు చుక్కలేదు.వెంటనే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు.

ఫిలిప్పీయులకు 3 : 19 – నాశనమే వారి అంతము, వారి_కడుపే_వారి_దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.

#దేవునికే_మహిమ_కలుగును_గాక!!ఆమెన్🙏

credits :
రాకడ కరుణ కుమార్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.