Christianity : Percentage matters !!!

క్రైస్తవుని తప్పుపట్టుకోవాలనే ఉద్దేశముతో క్రైస్తవేతరుడు ఇలా అన్నాడు.
క్రైస్తవేతరుడు: నాదొక చిన్న సందేహం
క్రైస్తవుడు: ఏంటది?
క్రైస్తవేతరుడు: దాదాపు రెండు వేల యేళ్ళ నుండీ క్రైస్తవ్యం భారతదేశములో వుందని ఒక సందర్భములో మీరు అన్నారు
క్రైస్తవుడు: అవును ఐతే…..?
క్రైస్తవేతరుడు: అప్పటి నుండి ఇప్పటిదాకా క్రైస్తవం పర్సంటేజ్ భారతదేశంలో కనీసం ఓ ఐదు శాతం కూడా లేదని నా భావం….ఎందుకింత తక్కువ పర్సంటేజ్???
క్రైస్తవుడు:సరే నేను కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగనా మరి?
క్రైస్తవేతరుడు: అడగండి.
క్రైస్తవుడు: ఒక ఊర్లో ఓ వెయ్యిమంది ఉన్నారు కానీ ఆ వెయ్యిమంది చేయని మంచి పనులు కేవలం ఓ ముగ్గులు మాత్రమే చేసారు. వెయ్యిమంది గొప్పా లేక ఆ ముగ్గురు గొప్పా?
క్రైస్తవేతరుడు: ముగ్గురే గొప్ప.
క్రైస్తవుడు: ఎందుకని ఆ ముగ్గురే గొప్ప, పర్సెంటేజ్ లో చాలా తక్కువ కదా ?
క్రైస్తవేతరుడు: ఆ ఊర్లో వెయ్యిమంది ఉన్నప్పటికీ వారందరూ చెయ్యని గొప్ప పనులు పర్సెంటేజ్ లో తక్కువగా వున్నప్పటికీ ఆ ముగ్గురే కదా చేసింది, అందుకని.
క్రైస్తవుడు: ఆ… అదేమరి, ఇప్పుడు అసలు సంగతికొద్దాం… 18 వ శతాబ్దములో కనీసం ఒక్క పర్సెంట్ కూడా లేని క్రైస్తవ మిషనరీలు మన దేశములో ఉన్న అతి భయంకరమైన మూడనమ్మకాలను నివారించారు అందులో, అంటరానితనాన్ని నివారించారు, స్త్రీ విద్యను ప్రవేశ పెట్టారు, బాల్య వివాహాలు రద్దు చేసారు,శిశు హత్యలను ఆపారు,సతి సహగమనం నివారించారు,రోగుల దయనీయ పరిస్థితి చూసి హాస్పిటల్స్ స్థాపించారు, వితంతు పునర్వివాహం ప్రవేశ పెట్టారు, నరబలులు నిషేధించారు, దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. ఇంకా చాలా చేసారు కానీ అన్నిటిలో ఇవి కొన్ని మాత్రమే. ఇప్పుడు చెప్పు క్రైస్తవ్యం పర్సెంటేజ్ లో తక్కువేయైనప్పటికీ సామాజిక స్పృహతో పనిచేసే విషయంలో మాత్రం ముందుకొస్తుంది.
క్రైస్తవేతరుడు: మీరు ఎప్పుడూ ఇలా తర్కించే మాట్లాడతారు తిన్నగా మాట్లాడడం చేతకాదా?
క్రైస్తవుడు: అందరితో నేను ఇలా మాట్లాడను కొందరితోనే ఇలా మాట్లాడతాను,
మరి ముఖ్యంగా, మీలాంటి వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాను.
క్రైస్తవేతరుడు: మీరెవరికీ అర్థం కారు, బై బై.
క్రైస్తవుడు: బై….