తోమా ఆసియా ఖండానికి ఎందుకు వచ్చాడు? |Why Thomas came to India?

ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున…. అపొ 16:6

పై వాక్యాన్ని బట్టి ఆసియాలో సువార్త చెప్పకూడదని వాక్యం చెబుతున్నది కదా మరి తోమా ఆసియా ఖండానికి ఎందుకు వచ్చాడు?

జవాబు:

ఇది పూర్తి సందర్భం చదవకపోవడం వలన వచ్చిన సమస్య. ఆసియా ఖండంలో వాక్యం చెప్పకూడదు అని వాక్యములో లేదు బితూనియాకు వెళ్ళవద్దని దేవుడు ఆటంకపరచినట్లు మాత్రమే వుంది, మాసిదోనియాకు రమ్మని పౌలును ఒక వ్యక్తి విన్నవించుకొంటాడు (అపొ16:6), కనుక అప్పటి ఆసియాలోని బితూనియకు వెళ్ళవద్దని దేవుడు వారిని ఆటంకపరిచాడు. అప్పటి అవసరం ప్రకారం ఆసియాలోని బితూనియాకు వెళ్ళడంకంటే రోము ప్రవాసస్థానమైన మాసిదోనియాకు వెళ్ళడం మంచిదని దేవుని చిత్తం. అందుకని వారు బితూనియాకు వెళ్ళే ప్రయాణాన్ని విరమించుకొని అవసరం కొద్దీ మాసిదోనియాకు వెళ్ళారు, అక్కడ సువార్త విని లూదియా అనే మహిళ దేవుని నమ్మింది.అక్కడ చాలా సువార్త చేసిన పిమ్మట వారు సమయానుసారాన్ని బట్టి అవసరతను బట్టి ఆసియాకు వచ్చి సువార్త చేసారు, అప్పుడు ఆసియాలో కాపురమున్నవారందరూ దేవుని వాక్యము విన్నారు (అపొకా19:10). ఆసియాలోని బితూనియాలో అవసరం కంటే మాసిదోనియాలో సువార్త అవసరం ఎక్కువగా వుంది కనుక ఆ అవసరాన్ని బట్టి ముందుగా వారు మాసిదోనియా వెళ్ళి అక్కడ సివార్త పని అయ్యిన పిమ్మట అప్పుడు ఆసియాకు వెళ్ళారు. అదీ సంగతి.

ఇక తోమా ఆసియా ఖండములోని భార్తదేశానికి ఎందుకు వచ్చాడు? 
నేను దీనికి రెండు కారణాలు చెబుతాను.

1–దేవుని వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పానుసారంగా యూదులకు మెస్సీయా మెస్సీయా పుడతాడని యూదులందరూ ఎదురుచూస్తున్నారు.దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ ఆయన ఉగ్రతకు లోనై ప్రపంచమంతటా చెదరగొట్టబడిన యూదులు భారతదేశానికి కూడా వలస వచ్చారు, సొలొమోను కాలమునుండే భారతదేశముతో ఇశ్రాయేలీయులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సో, ఇలా చెదర గొట్టబడిన యూదులు ప్రపంచములో ఎక్కడ వున్నప్పటికీ దేవుని వాగ్దాన సంతానమైన మెస్సీయా పుడతాడని ఎదురు చూస్తున్నకారణంగా, వేలయేండ్ల నుండి ఎదురు చూస్తున్న మెస్సీయాను తాను చూసానని, ఆయనతో కలిసి సేవ చేసానని, పాత నిబంధననో చెప్పబడిన ప్రవచనాలు ఆయనలో నెరవేరాయని ఇకపై మెస్సీయాను గూర్చి ఎదురుచూడాల్సిన అవసరం లేదని పూర్తి డేటాతో భారతదేశములో వున్న యూదులకు వచ్చాడు.

2- మానవులందరూ పాపులు కనుక ఆ పాపాలు యేసు రక్తములో కడగబడి నరకము నుండి తప్పించబడాలని అతను మానవాళి శ్రేయస్సు కోరుకున్నవాడు కనుక పైగా సర్వసృష్టికీ వెళ్ళి సువార్త ప్రకటించమని యేసు చెప్పాడు కనుక తోమా భారతదేశానికి బాధ్యతతో వచ్చాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.