Na Pere Theliyani Prajalu |నా పేరే తెలియని ప్రజలు
నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు (2)
ఎవరైనా మీలో ఒకరైనా (2) వెళతార నా ప్రేమను చెబుతారా (2)
1. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో (2)
ఎవరైనా మీలో ఒకరైనా (2) వెళతార నా ప్రేమను చెబుతారా (2)
2. వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి
వెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి (2)
ఎవరైనా మీలో ఒకరైనా (2) వెళతార నా ప్రేమను చెబుతారా (2)