Yehova Naa Mora |యెహోవ నా మొర లాలించెను
యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| అనీతి వస్త్ర మెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ|| విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ|| అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ||యెహోవ||