Unnapatuna Vachhu chunnanu |ఉన్నపాటున వచ్చుచున్నాను
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు– నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న|| దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న|