ఏ సాటి లేని యేసుని |Ye Saati leni Yesuni Prema
ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా
యిప్పుడైనా ఆశించి రావా
1. నీ దేవుండెవరు నీ పూజెవ్వరికి నశియించె వెండి బంగారాలకా
నిజ దైవమెవరు నీ రక్షకుడెవరు నీవెన్నడైనా తలచావా
నీకున్న లోటెరిగినావా
2. కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించిందీ నీ కొరకై
నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ
గ్రోలన్ మోదంబున రావదేల
3. వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప నవతరంచి
బలియాగమైన ప్రభు యేసు కాక మరి ఎవ్వరైనను కలరా
మనసారా యోచించిరావా