NITHYAMU STHUTHINCHINA NEE RUNAMU TEERCHALENU నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను
నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా ॥2॥
నీ త్యాగము మరువలేను
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు ॥2॥
॥నిత్యము॥
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా ॥2॥
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు ॥2॥రాజా॥
జీవమైన దేవుడా
జీవమిచ్చిన నాథుడా ॥2॥
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి ॥2॥రాజా॥
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా ॥2॥
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా ॥2॥ ॥రాజా॥