భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం ॥2॥
నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును ॥2॥
హల్లెలూయా లూయ హల్లెలూయా ॥4॥
1.బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను ॥2॥
దీన దశలో నేనుండగా నను విడువనైతివి ॥భూమ్యా కాశములు॥
2. జీవాహరమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా
నను తృప్తిపరచితివి ॥భూమ్యా కాశములు॥
3. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి ॥2॥ ॥భూమ్యా కాశములు॥
4. నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి ॥2॥
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి ॥భూమ్యా కాశములు॥
Like this:
Like Loading...
Related