Arbhatamutho Pradhana Dootha Bro Yesanna
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో
మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు
అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము
అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు
ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే
పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము
సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు
గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము
వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము
ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో
యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము