నా మార్గము నకు దీపమైన - నా యేసునితో సదా సాగెద
గాడాంధకారపు లోయలలో - మరణ భయము నన్ను క్షమ్మినను
ఆత్మయందు నేను క్రుంగిపోవక - అనుదినం ఆనందింపచేయునట్టి
ఆత్మనాధునితో సాగెదను || నా మార్గం||
నా యొక్క ప్రయత్నములన్నియును - నిష్పలముగ అవి మారినను
నా యొక్క ఆశలు అన్నియును - నిరాశలుగ మారిపోయినను
నిరీక్షణతో నే సాగెదను || నా మార్గం||
సమస్తమైన నా భారములు - సంపూర్ణముగ ప్రభు తీర్చునుగా
నా సన్నిధి నీకు తోడుగా - వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను || నా మార్గం||
ప్రతి ఫలము నేను పొందుటకు - నిరీక్షణతో నున్న ధైర్యమును
పలుశ్రమలందును విడువకుండ - ప్రాణాత్మ దేహము సమర్పించి
ప్రియుని ముఖం చూచి సాగెదను || నా మార్గం||