Na yesayya nee Divya premalo | నా యేసయ్య నీ దివ్య ప్రేమలో
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో నా జీవితం - పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై - విలపించు సమయాన ఓదర్చువారే - కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 2. పూర్ణమనసుతో - పరిపూర్ణఆత్మతో పూర్ణబలముతో - ఆదరించెద నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 3. జయించిన నీవు - నా పక్షమైయుండగా జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య |