Randi Randi Yesu pilichenu | రండి రండి యేసు పిలిచెను
రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ పొందగను
ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను
అ.ప. : పొందుము తక్షణం రక్షణ భాగ్యము
1. ఏది నీజాతి ఏ వంశమైనా ఏ కులము నీదేమతమైనా
ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి
2. నిన్ను నన్ను రక్షించుటకై యేసుప్రభువు శిక్షింపబడెను
మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను
3. నీదుపాపము ఒప్పుకొనుము యేసుక్రీస్తుని అంగీకరించుము
తన రుధిరములో నిన్ను కడుగును నీతిమంతునిగా మార్చివేయును
రచన : డా ॥ ఎ.డి. శిఖామణి