Sri Yesundu Needu namamandu | శ్రీ యేసు నీదు నామమందు
శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం
ఆలకించి ఆశీర్వదించుమా అందుకొనుము మా విన్నపం
1. నీ నామమందు ప్రార్థించి పొందినాము గొప్ప రక్షణ
రక్షింపబడిన హృదయమందు ముద్రించినావు ఆత్మను
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
2. విశ్వాససహితమైన ప్రార్థన విజయమిచ్చునన్నావయా
తండ్రి సముఖమునకు చేర ప్రార్థన నీ నామముంచినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
3. పాపంబు స్వార్ధంబు లేక మొర్రపెట్టనేర్పినావయా
సందేహపడక విధేయతతో ప్రార్థింపజూపినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
రచన : డా ॥ ఎ.డి. శిఖామణి