Stuthiyinchedanu Stuthi paatruda | స్తుతియించెదను స్తుతి పాత్రుడా నిను
స్తుతియించెదను స్తుతి పాత్రుడా నిను భజియించెదను భయభక్తితోను అ.ప. : వందనమయ్యా యేసయ్యా నీకే ప్రణుతులు మెస్సీయా 1. నీ గుణగణములు పొగడను తరమా నీ ఘనకీర్తిని పాడ నా వశమా పరలోక సైన్యపు స్తుతిగానములతో దీనుడ నా స్తుతి అంగీకరించుమా 2. నీ ఉపకారములు లెక్కింపగలనా నీ మేలులన్నియు వర్ణింపనగునా నా హృదిగదిలో నివసింపగోరిన నజరేయుడా నిను హెచ్చింతునయ్యా 3. నీ సిల్వప్రేమను వివరింప శక్యమా నీ సన్నిధి లేక జీవింపసాధ్యమా ఆరాధించెద ఆత్మతో నిరతం నీ క్షేమముతో నింపుమా సతతం