Yehova Ninnu Poliyunna | యెహోవా నిన్ను పోలియున్న
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటియైన వారెవ్వరు 1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడా కాంక్షనీయుడా వందనములకర్హుడా పూజ్యనీయుడా 2. పాపికొరకు ప్రాణమిడిన ప్రేమరూపుడా లోక శాపమును మోసిన సిలువధారుడా మరణపుకోరలు పీకిన విజయవీరుడా శరణన్నచో కరుణ చూపు పరంధాముడా 3. ఆదియు అంతములేని అగ్నినేత్రుడా ఆదరించు నాధుడా స్తుతికి పాత్రుడా కన్యక కడుపునబుట్టిన పరమపుత్రుడా అన్యజనుల జతకట్టిన మంచి మిత్రుడా