Yesayya Priyamaina Ma rakshaka | యేసయ్యా ప్రియమైన మా రక్షకా
యేసయ్యా ప్రియమైన మా రక్షకా
నీదు ప్రేమకై స్తుతియింతుము
నిన్ను పూజింతుము - నిన్ను సేవింతుము
నిన్ను మనసార స్మరియింతుము
1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను
నీదు శరీరము బలిగాచేసి విలువైనవారిగా చేసితివి
2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి
నీ కరుణను ఇల వర్షింపజేసి సిలువ పై ప్రాణము వీడితివి
రచన : డా ॥ ఎ.డి. శిఖామణి