మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే - మహా ఆశ్చర్యమే || మాధు ||
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును - వాడిపోవును || మాధు ||
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయభక్తులతో
ఉండుటే మేలు - ఉండుటే మేలు || మాధు ||
నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను - పరిహరించెను || మాధు ||
వాడవారని కిరీటమునకై నన్ను పిలిచెను
తెజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో || మాధు ||