Naa Neethikaadarameeve | నా నీతికాధారమీవే
నా నీతికాధారమీవే ఓ నీతిమంతుడా
నీ నీతి నాకొసగినావా నీ రక్తధారలలోనా
1. నా రక్షణాకాధారమీవే నా శిక్ష భరియించినావా
నిరీక్షణ కాధారమీవే సంరక్షకుడా నా యేసూ
2. నా జ్ఞానానికాధారమీవే లోక జ్ఞానము వెఱ్ఱితనమే
నా ప్రాణానికాధారమీవే నీ ప్రాణము నాకిచ్చినావా
3. నా క్షేమానికాధారమీవే నీ సౌఖ్యమే విడచినావా
నా పోషణకాధారమీవే నీ కాయమునర్పించినావా
రచన : డా ॥ ఎ.డి. శిఖామణి