Vandanamu Neeke|వందనము నీకే నా వందనము

వందనము నీకే నా వందనము 
వర్ణనకందని నీకే నా వందనము 

నీ ప్రేమ నేనేల మరతు - నీ ప్రేమ వర్ణింతునా 
దాని లోతు ఎత్తునే గ్రహించి - నీ ప్రాణ త్యాగమునే తలంచి     || వంద || 

సర్వ కృపానిధి నీవే- సర్వాధిపతియును నీవే 
సంఘానికే శిరస్సు నీవే - నా సంగీత సాహిత్యము నీవే           || వంద || 

పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలమువలె 
పరమునుండి పోయబడి - పరవశించి నేను పాడెదను           || వంద || 

మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి 
కృషి లేక నీ కృప రక్షించెను - కృతజ్ఞతార్పణలర్పింతును        || వంద ||

త్రండ్రియైన దేవునికే - కుమారుడైన దేవునికే 
పరిశుద్ధాత్మ దేవునికే - వందన వందన వందనము                || వంద ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.