అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా
అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను
అబ్రహాముకు చాలిన దేవుడవు నీవేనయ్యా
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || అబ్రహాము ||
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను
ఇస్సాకుకు చాలిన దేవుడవు నీవేనయ్యా
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || అబ్రహాము ||
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను
యాకోబుకు చాలిన దేవుడవు నీవేనయ్యా
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || అబ్రహాము ||
Like this:
Like Loading...
Related